హెరిటేజ్ ఫ్రెష్ మాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా..చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

హెరిటేజ్ ఫ్రెష్ మాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా..చంద్రబాబు

December 10, 2019

Chandrababu naidu01

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఉల్లి ధరల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షనేత చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ ఫ్రెష్‌లో కిలో ఉల్లి రూ.200కి అమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. ఉల్లిని తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తోందని… అందుకే రైతు బజార్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు శవరాజకీయాలు చేయడం కొత్త కాదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

హెరిటేజ్ ఫ్రెష్ తమది కాదని ఎన్నిసార్లు చెప్పినా అవే మాటలు మాట్లాడటం సరికాదన్నారు. దీని గురించి నిన్ననే తాను స్పష్టంగా చెప్పానన్నారు. అయినా, అధికార పార్టీ నేతలు సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ తమదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. ఒకవేళ నిరూపించలేకపోతే సీఎం పదవికి జగన్ రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. భారతి సిమెంట్స్, సోలార్ విండ్ పవర్ మాదిరి మీలా తాము మోసాలు చేయలేదని అన్నారు.