ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు

April 15, 2019

ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత కూడా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కాదు.. పొరుగు రాష్టం కర్ణాటకలో ప్రచారానికి వెళుతున్నారు.

Chandrababu Naidu for Pandavapura today.

కర్ణాటకలో అధికారంలో ఉన్న జేడీఎస్ పార్టీ తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఆ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ప్రధాని దేవెగౌడ ఆహ్వానం మేరకు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళుతున్నారు. సోమవారం చంద్రబాబు జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం చేయనున్నారు. దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి ఎన్నికల సభల్లో పాల్గొంటారు. మైసూరు దగ్గరలోని పాండవపురలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అలాగే తెలుగువారు ఎక్కువగా ఉండే జిల్లాల్లో కూడా చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు.