Chandrababu naidu Jumps Canals in Palnadu
mictv telugu

చంద్రబాబు జంప్..మామూలుగా లేదు కదా..!

October 19, 2022

Chandrababu naidu Jumps Canals in Palnadu

టీడీపీ అధినేత చంద్రబాబు ది డిఫరెంట్ స్టైల్.నేను నిద్రపోను..మిమ్ముల్ని నిద్రపోనివ్వను అంటూ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు విపక్ష నేతగానూ అంతే.ఉరిమే ఉత్సాహంతో కార్యకర్తలతో కలిసిపోతారు. మాటల్లోనే కాదు చేతల్లోనూ యువకుడిగాఅడుగులేస్తున్నారు. 72 ఏళ్ల వయస్సులోనూ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. నిత్యం జనాల్లో ఉంటూ పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఏపీలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే ప్రత్యక్షమైపోతున్నారు.

కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగుతారు. కష్టాల్లో ఉన్న జనాన్ని ఓదారుస్తారు.బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు… రైతుల సమస్యలపై దృష్టి సారించారు. పొలాల్లో సూపర్ జంప్ లు చేస్తూ పరిశీలించారు. కాలవలపై నుంచి దూకుతూ ముందుకు సాగారు. కాలవ గట్లపై 72 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు ఈజీగా దూకేశారు. చంద్రబాబు ఫీట్లని చూసిన టీడీపీ నాయకులు స్టన్ అయ్యారు. ఇక సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబుకు ముందు కొందరు, ఆయన వెనుకాల కొందరు నిలబడ్డారు వీరి సాయం లేకుండానే చంద్రబాబు ఈజీగా కాలువ గట్లను దాటేశారు.

అప్పట్లో ఏపీ వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా ఇలాగే చేశారు. అడ్డుగా ఉన్న ఓ కాలువను జంప్ చేశారు.అదిరిపోయే ఫిటెనెస్ తో ఉన్న జగన్ వీడియో తెగ వైరల్ అయింది. దాన్నే టీడీపీ అధినేత చంద్రబాబు స్ఫూర్తిగా తీసుకున్నారేమో…పల్నాడు పొలాల్లో అదిరిపోయే జంప్ చేశారు.