టీడీపీ మేనిఫెస్టో విడుదల..18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు రూ.1,500
2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ మేనిఫెస్టో రూపొందించింది. రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మినీ మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారు. యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000 ఇస్తాం’’ అని వెల్లడించారు.18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా.. అందిస్తామని తెలిపారు.రైతు కోసం అన్నదాత కార్యక్రమం తీసుకొచ్చి.. ప్రతి రైతుకు ఏటా రూ.20వేలు ఇస్తామన్నారు. యువగళం కింద 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
టీడీపీ అధికారంలోకి రాగానే తల్లికి వందనం పేరుతో ఏటా ప్రతి బిడ్డ తల్లి అకౌంట్లో రూ.15 వేలు జమ చేస్తామని తెలిపారు. ముగ్గురు పిల్లలున్నా ముగ్గురికి ఇస్తామన్నారు. మహిళల కోసం మహాశక్తి, యువత కోసం యువగళం, రైతుల కోసం అన్నదాత కార్యక్రమం, ఇంటింటికీ తాగునీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ కార్యక్రమాలు చేపడతామని టీడీపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది.
టీడీపీ మేనిఫెస్టో ప్రధానాంశాలు
* ప్రతి రైతుకు ఏటా రూ.20వేలు
* 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు
* యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000
* ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లోకి
* 18 నుంచి 59 ఏళ్లు వున్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి
*ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి పథకం
*తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లీకి ఏటా రూ.15 వేలు
*స్ధానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
*ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు
*జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
*ఇంటింటికీ తాగునీరు