రేవంత్ పోవడం వల్ల నష్టమేమీ లేదు - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ పోవడం వల్ల నష్టమేమీ లేదు

October 28, 2017

రేవంత్ రెడ్డి టీడీపీని వదలి వెళ్లిపోవడం వల్ల పార్టీకి ఏ నష్టమూ ఉండదని అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘రేవంత్ రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నాకింత వరకు రాజీనామా లేఖ అందలేదు. ఒకవేళ అదే నిజమైనా.. పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. మాది పెద్ద పార్టీ. ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. కొంతమంది.. వారి వారి ప్రయోజనాలను, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెళ్లిపోతుంటారు. మరోపక్క.. పార్టీలోకి ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు. ఇలాంటి వాళ్లతో మాకు ఎలాంటి నష్టమూ ఉండదు’ అని అన్నారు. రేవంత్‌తో తర్వాత మళ్లీ వివరంగా మాట్లాడతానని చెప్పినా, ఆయన వినకుండా వెళ్లిపోయారన్నారు.