వైఎస్సార్ నాకు బెస్ట్ ఫ్రెండ్... ఒకే గదిలో పడుకున్నాం: చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్సార్ నాకు బెస్ట్ ఫ్రెండ్… ఒకే గదిలో పడుకున్నాం: చంద్రబాబు

July 18, 2019

Chandrababu naidu.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమావేశాల్లో కృష్ణానది కరకట్టపై జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై చర్చ జరుగుతున్నది. ఈ సమయంలో రోడ్లపై అడ్డుగా ఉన్న విగ్రహాల ప్రస్తావనను చంద్రబాబు తీసుకొని వచ్చారు. వందలాది వైఎస్ విగ్రహాలను అనుమతి లేకుండా పెట్టారని చంద్రబాబు ఆరోపించడంతో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు కావాలనే రెచ్చగొడుతున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. వైఎస్ విగ్రహాలను చూసి ఆయన కడుపు మండుతోందని మండిపడ్డారు.

దీంతో చంద్రబాబు కొన్ని కీలక వాఖ్యలు చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ..”అధ్యక్షా… రాజశేఖరరెడ్డిగారి విగ్రహం… నాకు కడుపు మండేదేంటి అధ్యక్షా. రాజశేఖరరెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్. చరిత్ర అధ్యక్షా ఇది. మీకు తెలీదా? రాజశేఖరరెడ్డి నాకు ఎంత మంచి స్నేహితుడంటే..మేమిద్దరమూ మంత్రులుగా ఒక రూములో పడుకునేవాళ్లం అధ్యక్షా. అంత క్లోజ్ ఫ్రెండ్. అది జగన్ మోహన్ రెడ్డికి తెలీకపోవచ్చు. 77-83… మా ఇద్దరినీ చూసిన వారికి తెలుస్తుంది. మా మధ్య రాజకీయ విరోధం ఉందే తప్ప, వ్యక్తిగత విరోధం లేదు. నేను తెలుగుదేశంలోకి వచ్చాను. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. రాజకీయంగా పోరాడాం తప్ప, వ్యక్తిగతంగా కాదు” అన్నారు.