చంద్రబాబు కూడా ఎక్కేశారు. - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు కూడా ఎక్కేశారు.

December 13, 2017

ప్రధాని నరేంద్ర మోదీ నిన్న సబర్మతి నదిలో సీప్లేన్‌లో ప్రయాణించిన ముచ్చట మరవక ముందే ఏపీ సీఎం కూడా ఆ ప్రయాణంపై ముచ్చటపడ్డారు. బాబు బుధవారం విజయవాడ వద్ద కృష్ణా నదిలో సీప్లేన్‌లో చక్కర్లు కొట్టారు. ట్రాయల్ రన్ లో భాగంగా ఆయన నదీయాత్ర  చేశారు.

పున్నమి ఘాట్‌ నుంచి సీప్లేన్‌లో బయల్దేదారు. ఈ సముద్రవిమానంలో పౌర విమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజు, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల, ఓ విద్యార్థిని వెళ్లారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి పోలీసులు అనుమతివ్వకపోవడంతో జనం దృష్టిని ఆకర్షించేందుకు మోదీ సీప్లేన్లో వెళ్లిన సంగతి తెలిసిందే.