టీడీపీని ఎలా బతికిద్దాం! - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీని ఎలా బతికిద్దాం!

November 2, 2017

రేవంత్ రెడ్డి, సీతక్క తదితర కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలంగాణ టీడీపీ నేతలు గురువారం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో ప్రస్తుతం టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశం జ‌రుగుతోంది. చంద్ర‌బాబు, టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌, మోత్కుప‌ల్లి న‌ర్సింహులతోపాటు సండ్ర వెంక‌ట వీర‌య్య‌, రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి, నామా నాగేశ్వ‌ర‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ‌లో టీడీపీని తిరిగి ఎలా బ‌లోపేతం చేయాలన్నదానిపై మంతనాలు జరుపుతున్నారు. టీఆర్‌ఎస్ నేతలతో ఆంధ్రా టీడీపీ నేతలు వ్యాపార లావాదేవీలు నడుపుతున్న విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కాగా, భేటీకి ముందు రమణ విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిందని, ఇప్పుడు ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారి నాశనమైపోయిందని అన్నారు.