Chandrababu participated in Anaparthi Sabha
mictv telugu

నేను కూడా పారిపోతే మిమ్మల్ని చంపినా దిక్కుండదు : చంద్రబాబు

February 17, 2023

తూర్పుగోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం ఆనపర్తిలో పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు బలభద్రపురంలో పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకన ఏడు కిలోమీటర్లు సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో నడుచుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు వైసీపీ పాలనను ఏకిపారేశారు. ‘నాడు ముద్దులు పెట్టుకుంటా ఈ సైకో చేసిన పాదయాత్రను అడ్డుకున్నామా? ఆయన తండ్రి పాదయాత్రను అడ్డుకున్నానా? అనుమతులున్నా పోలీసుల చేత అడ్డుకోవాలని చూస్తున్నారు. నేనేమైనా పాకిస్తాన్ నుంచి వచ్చానా? ఇక్కడికి రావడానికి నాకు హక్కులేదా? నేనేమీ సీఎం కావాలని కోరుకోవడం లేదు. భవిష్యత్ తరాల కోసం పోరాడుతున్నాను. నేను కూడా పారిపోతే మిమ్మల్ని చంపినా అడిగే దిక్కులేద’ని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. రేపటి రోజున తన దగ్గరే పోలీసులు యూనిఫాం వేసుకొని పని చేయాల్సి ఉంటుందని, అక్రమాలకు పాల్పడిన పోలీసులను వదిలేది లేదని హెచ్చరించారు. చట్టప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతానని ఘాటుగా వ్యాఖ్యానించారు.