ఉల్లి దండలతో అసెంబ్లీకి చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

ఉల్లి దండలతో అసెంబ్లీకి చంద్రబాబు

December 9, 2019

Chandrababu

ఏపీ అసెంబ్లీకి ఉల్లి ఘాటు తాకింది. ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో నిరసన తెలిపారు. సోమవారం ఉదయం సభ ప్రారంభానికి ముందు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు,నారా లోకేశ్ తో పాటు పలువురు నేతలు ఉల్లి దండలు ధరించి ఓ తక్కెడతో నిరసన తెలిపారు. ప్రభుత్వం ఉల్లి ధరలను అదుపు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఓ దశలో అసెంబ్లీలోకి ఉల్లి దండలతో వెళ్లాలని టీడీపీ నేతలు ప్రత్నించగా అసెంబ్లీ సిబ్బంది అంగీకరించలేదు. కొంతసేపు అక్కడ వాగ్వాదం జరిగింది. 

ప్లకార్డులను కూడా లోపలికి అనుమతించేది లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బంగారం, ఉల్లిపాయలు రెండూ సమాన స్థాయికి చేరుకుంటున్నాయని వ్యంగ్యంగా మాట్లాడారు.  గతంలో తమ ప్రభుత్వం సబ్సిడీపై తక్కువ ధరలకే సరుకులు అందించామని చంద్రబాబు తెలిపారు. నిత్యావసర ధరలు నియంత్రించే వరకు టీడీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.