చంద్రబాబును హైదరాబాద్ విమానం ఎక్కించిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబును హైదరాబాద్ విమానం ఎక్కించిన పోలీసులు

February 27, 2020

Chandrababu.

రెండు రోజుల పర్యటన కోసం గురువారం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. కేకలు, కోడుగుడ్లు, చెప్పులతో టీడీపీ, వైసీపీ శ్రేణులు దాడులు చేసుకున్నారు. పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యాయత్నం బెదింరింపులతో ఆయన ఉత్తరాంధ్ర పర్యటన రద్దయింది. సాయంత్రం చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు.. రాత్రికి ఆయనను హైదరాబాద్ విమానం ఎక్కించారు. దీంతో హైడ్రామాకు తెరపడింది. పోలీసుల వైఖరిపి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటనకు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు అరెస్టులకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. 

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద గురువారం ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిగో వదిలేస్తాం అని చెప్పి చివరికి చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. మూడు గంటలు లాబీలోనే గడిపిన బాబును చివరికి హైదరాబాద్ తరలించారు. బాబు వెళ్లిపోయిన వెంటనే వైసీపీ, టీడీపీ శ్రేణులు ఇంటిబాట పట్టారు. దీంతో టెన్షన్ వాతావరణం సద్దుమణిగింది. ఈ సందర్భంలో గతంలో జరిగిన ఓ ఘటనను సోషల్ మీడియాలో చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. సేమ్ సీన్ రివర్స్ అయిందంటూ.. 2017 జనవరి 26న వైజాగ్‌లో ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేపట్టిన క్యాండిల్ ర్యాలీని సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు విశాఖలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ జరుగుతోందని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం క్యాండిల్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. దీంతో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో కలిసి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పుడు పోలీసులు వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు.