చంద్రయాన్ -2 : ఈ అర్ధరాత్రి అద్భుత ఘట్టం
Editor | 5 Sep 2019 11:07 PM GMT
చంద్రయాన్ -2 ప్రయోగంలో కీలక ఘట్టానికి మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. నేడు అర్థరాత్రి 1 గంటల నుంచి 2 గంటల మధ్యలో జాబిల్లిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకోనుంది. చంద్రుడి కక్షలో ల్యాండర్ వేగాన్ని తగ్గించి 15 నిమిషాల్లో ల్యాండింగ్ ప్రక్రియను ముగించనున్నారు. ల్యాండర్ దిగిన తర్వాత ఉదయం 4 నుంచి 5 గంటల సమయంలో రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తుంది.
చంద్రుడిపై ఈ ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. అక్కడి పరిస్థితులను ఇస్త్రోకు ఎప్పటికప్పుడు తెలియజేయనుంది. అయితే 48 రోజుల ప్రయాణం ఒక ఎత్తు అయితే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే 15 నిమిషాలు అత్యంత కీలకం కానుంది. ఈ ల్యాండింగ్ ప్రక్రియను ప్రధాని మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 60 మంది విద్యార్థులు బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
Updated : 6 Sep 2019 3:47 AM GMT
Tags: Chandrayaan-2 ISRO landing MODI moon Vikram Rover
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire