Home > Featured > చంద్రయాన్-2 మరో కీలక ఘట్టం

చంద్రయాన్-2 మరో కీలక ఘట్టం

Chandrayan-2.

ఇస్త్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తయింది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆఖరి దశ విజయవంతంగా ముగిసింది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుని కక్షలోకి ప్రవేశించింది. నిర్థేశిత కక్ష్యలో ప్రయాణించిన తర్వాత ఈనెల 7న చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. సోమవారం మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంట మధ్య ల్యాండర్ వేరుపడింది.

గత నెల 22న నింగికి ఎగిసిన చంద్రయాన్ -2 చంద్రుని కక్ష్యలోకి చేరుకునేందుకు ఒక్కో దశను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆర్బిటర్‌తో విడిపోయిన ల్యాండర్‌కు ఈనెల 3, 4 లేదీల్లో కక్ష్యను తగ్గిస్తారు. ఈనెల 7వ తేదీన‘పవర్‌ డిసెంట్‌’ దశ ప్రారంభం అవుతుంది. వ్యోమ నౌకలోని ర్యాకెట్లను మండించడం ద్వారా ల్యాండర్‌ను కిందకు దించుతారు. ఈ ప్రక్రియ మొదలైన 15 నిమిషాల్లోగా ల్యాండర్‌ చంద్రుడిపైకి చేరుకుంటుంది. ఈ అద్భుతమైన ఘట్టం కోసం శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated : 2 Sep 2019 3:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top