ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాక్టికల్స్ పరీక్షల తేదీలు మారే అవకాశం ఉంది. ఇంటర్మీడియెట్ విద్యామండలి ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం థియరీ పరీక్షలు పూర్తయ్యాక ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలు కారణంగా ఏప్రిల్15 నుంచి మే10 వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్ ను నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావించింది. కానీ ఇప్పుడు దీనిపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసెట్ తదితర పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు తగిన సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని కళశాలల యాజమాన్యాలు కూడా ఇంటర్ విద్యామండలికి విజ్ఞప్తులు పంపించాయి. దీంతో థియరీ పరీక్షలకు ముందుగానే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఇక ఇంటర పరీక్షలు షెడ్యూల్ విషయానికొస్తే.. మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్..మార్చి 16వ తేది నంచి సెకండియర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3న ముగియనుండగా.. సెకండియర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 4న ముగుస్తాయి.