వ్యాపారాన్ని హైద్రాబాద్‌కు మారుస్తున్నా.. జగనే కారణం : విశాఖ ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

వ్యాపారాన్ని హైద్రాబాద్‌కు మారుస్తున్నా.. జగనే కారణం : విశాఖ ఎంపీ

March 29, 2022

bfbfd

విశాఖ పట్టణం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై విశాఖలో వ్యాపారం చేయనని, హైద్రాబాదుకు మారుస్తున్నానని ప్రకటించారు. విశాఖలో రియల్ ఎస్టేట్‌లో పలు కీలక ప్రాజెక్టులు చేపట్టిన ఎంవీవీ.. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖలో ఇంటెలిజెన్స్ ఎస్పీ స్థలాన్ని కబ్జా చేశారనే ఆరోపణలు ఎంపీపై వచ్చాయి. దీనిపై ఎంవీవీ చాలా బాధపడ్డారు. ఇక్కడ వ్యాపారం చేస్తే ఏదో విధంగా ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూ ఉంటారు కాబట్టి, హైదరాబాదే మేలు అని స్పష్టత ఇచ్చారు. తన వల్ల సీఎం జగన్‌కు చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నట్టు వెల్లడించారు. ఇకపై విశాఖలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టనని, పాత ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు కొనసాగుతాయని వివరించారు.