ఇటీవలి కాలంలో డేటింగ్ మారింది. భారతదేశంలోనూ సర్వసాధారణం అయింది. అయితే భారతదేశంలో వివాహేతర డేటింగ్ యాప్ కూడా విజయవంతమవుతుందని ఎవరు
ఊహించరు?
డేటింగ్ యాప్ లు లింగం లేదా ధోరణితో సంబంధం లేకుండా భాగస్వామిని కలవడంలో మీకు సహాయపడుతాయి. ఇటీవల ఫ్రాన్స్ కు చెందిన వివాహేతర డేటింగ్ యాప్ గ్లీడెన్ ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల మంది వినియోగదార్లు ఉన్నట్లు ప్రకటించింది. అందులో 2 మిలియన్ల మంది వినియోగదారులు భారతదేశం నుంచే ఉణ్నారు. అది కూడా సెప్టెంబర్ 2022 నుంచి 11 శాతం పెరిగింది. కంపెనీ అందించిన డేటా ప్రకారం.. కొత్త కస్టమర్లలో అత్యధికులు టైర్ 1 నగరాలకు చెందినవారు (66శాతం) పోల్చి చూస్తే, మిగిలిన కొత్త సబ్ స్క్రైబర్ లు టైర్ 2, టైర్ 3 నగరాల(44 శాతం) నుంచి వచ్చారు.
భారతదేశంలో..
భారతదేశం అంటే వివాహ వ్యవస్థ. ఏకస్వామ్యాన్ని ఆరాధించే దేశం. అలాంటిది ఇలాంటి డేటింగ్ యాప్ కి వినియోగదారులు పెరుగడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. 2022లో మాత్రమే 18శాతం కొత్త వినియోగదారులను తీసుకువచ్చింది. ఇది 2021లో 1.7 మిలియన్ల నుంచి ప్రస్తుతం రెండు మిలియన్లకు చేరుకుంది. వివాహితుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినందుకు.. గ్లీడెన్ లో భారతీయ వినియోగదారుల పెరుగదల దేశంలో ఏకస్వామ్యం సంప్రదాయ భావనలు ఎలా క్రమంగా మారుతున్నాయో ప్రతిబింబిస్తుంది.
గ్లీడెన్ లోని భారతీయ వినియోగదారుల్లో ఎక్కువ మంది అధిక సామాజిక, ఆర్థిక వాతావరణం నుంచి వచ్చినవారేనని కంపెనీ తెలిపింది. పురుషులు, మహిళలు.. ఇద్దరూ ఇంజనీర్లు, వ్యవస్థాపకులు, కన్సల్టెంట్స్, మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్, ఫిజిషియన్స్ వంటి నిపుణులు, అధిక సంఖ్యలో గృహిణులు కూడా ఉన్నారు. వయసు విషయానికొతే ఎక్కువ 30 కంటే ఎక్కువ, మహిళలు 26 వయసు కంటే ఎక్కువ ఉన్నారు. ఈ యాప్ మహిళలకు మరింత సురక్షితంగా ఉండేలా రూపొందించబడిందని కంపెనీ పేర్కొంది. 2023లో 60శాతం మంది పురుషులతో పోలిస్తే 40శాతం మంది మహిళా వినియోగదారులు ఉంటారని కంపెనీ పేర్కొంది.