Chaotic 'Goat of Kyiv' Leaves 40 Russian Soldiers Injured After Setting Off Booby Trap
mictv telugu

రష్యా సైనికులకు చుక్కలు చూపించిన చిన్న మేక

June 27, 2022

Chaotic 'Goat of Kyiv' Leaves 40 Russian Soldiers Injured After Setting Off Booby Trap

తాము తీసుకున్న గోతిలో తామే పడినట్లయింది రష్యా సైనికుల పరిస్థితి. అది కూడా ఓ చిన్న మేక వల్ల. ఒకరిద్దరు కాదు.. దాదాపు 40 మందికిపైగా రష్యా సైనికులు ఆ మేక కారణంగా తీవ్ర గాయాలపాలయ్యారు.ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. ఉక్రెయిన్‌లోని జపొరోజియా పట్టణానికి కాస్త దూరంలో ఉన్న కిన్ స్కీ రోజ్డొరీ గ్రామంలోని ఆస్పత్రి సమీపంలో రష్యా సైనికులు.. ఉక్రెయిన్ సైనికులను చంపేందుకు (బూబీ ట్రాప్‌లు) గ్రనేడ్లను నేలలో వరుసగా అమర్చి వాటికి తీగలను కనెక్ట్ చేస్తున్నారు.

సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతానికి కాస్త దూరంలో ఉన్న ఓ మేకల ఫామ్ నుంచి ఓ మేక తప్పించుకుని బయటికి వచ్చింది. బూబీ ట్రాప్ లను అమర్చుతున్న ప్రాంతం వైపు పరుగెత్తింది. మొదట ఒక ట్రాప్ దాని కాలికి తగిలి గ్రనేడ్ పేలింది. దీనితో భయపడిన మేక వేగంగా పరుగెత్తడంతో వరుసగా ఒకదాని తర్వాత మరోటి గ్రనేడ్ లన్నీ పేలిపోయాయి. వాటిని అమర్చుతూ వెళ్తున్న రష్యా సైనికులు దీంతో కకావికలమయ్యారు. ఈ పేలుళ్లలో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని.. కొందరు చనిపోయి ఉంటారని ఉక్రెయిన్ నిఘా వర్గాలు తెలిపాయి. ఆ మేక చనిపోయిందో లేదో తెలియదు కానీ.. రష్యా సైనికులను మాత్రం వణికించిందని దానిని ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్’ గా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.