డిలీట్ చేసిన ఎన్టీఆర్ జైలు సీన్ ఇదీ.. బయటపెట్టిన నటుడు - MicTv.in - Telugu News
mictv telugu

డిలీట్ చేసిన ఎన్టీఆర్ జైలు సీన్ ఇదీ.. బయటపెట్టిన నటుడు

April 21, 2022

భారీ మల్టీస్టారర్ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ సీన్లను హైలెట్ చేస్తూ, ఎన్టీఆర్‌ను తక్కువ చేసి చూపారని అభిమానులు నొచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇద్దరు హీరోలతో పాటు రాజమౌళి చెప్పినా కూడా సంతృప్తికరంగా అనిపించలేదు. ఈ నేపథ్యంలో సినిమాలో డిలీట్ చేసిన ఎన్టీఆర్ జైలు సన్నివేశాన్ని అందులో నటించిన నటుడు బయటపెట్టాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ పవర్ ఫుల్ సీన్ కట్ చేశారు. రాంచరణ్ ఎన్టీఆర్‌ను కొరడాతో కొట్టిన తర్వాత తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అదే జైలులో కొంత మంది తెలుగు ఖైదీలు ఉంటారు. వారితో పాటు నేను కూడా ఉన్నాను. ఎన్టీఆర్ ఏం మాట్లాడకుండా కూర్చుంటాడు. మేం ఆయన వద్దకు వెళ్లి బ్రిటీష్ వాళ్లను ఎదిరించి మేమంతా జైళ్లో ఉన్నాం. కానీ, మీరు మాత్రం వాళ్లను కొట్టి ఉచ్చ పోయించారు. మీరే మా నాయకుడు, మీవెంటే మేముంటామని నినాదాలిస్తాం. అప్పుడు మాలో కనిపించే ఉక్రోషం, ఆవేశం ప్రేక్షకులను రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఈ సన్నివేశం ఉండుంటే సినిమా మరో రేంజులో ఉండేదం’టూ వెల్లడించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరికీ సమానంగా సీన్లు రాశానని చెప్పి ఇలా చేస్తారా? అంటూ మండిపడుతున్నారు. మరి కొందరు ఓటీటీలోనైనా ఈ సీన్ జత చేస్తారా? అని అడుగుతున్నారు.