charan first shared with tarak about becoming father
mictv telugu

ఆ శుభవార్తను మొదట తారక్‌కే చెప్పా- రామ్ చరణ్

February 23, 2023

charan first shared with tarak about becoming father

తాను తండ్రి కాబోతున్న విషయాన్ని మొట్టమొదటగా తన బెస్ట్ ఫ్రెండ్ తారక్‌తోనే చెప్పానని అన్నాడు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్. ‘‘ముందు అమ్మానాన్నలకు చెప్పా, తరువాత మాత్రం ఎన్టీయార్‌తోనే చెప్పా. మా జీవితంలో మరో వ్యక్తిని ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పాడు. అమెరికన్ టాక్ షో ‘‘గుడ్మార్నింగ్ అమెరికా’’లో మాట్లాడుతూ కుటుంబ విషయాలు పంచుకున్నాడు.

తండ్రి కాబోతున్నారు కదా ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తోందని అడగ్గా, ‘‘అదొక అందమైన అనుభూతి. నేను, నా భార్య జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభించాం. ఇంతవరకూ ఉపాసనకు అంతగా దొరికేవాడిని కాదు కానీ ఇప్పుడు తప్పడం లేదు’’ అని సరదాగా బదులిచ్చాడు.

 

రామ్ చరణ్, తారక్ చాలా మంచి స్నేహితులు. ఎక్కడికైనా కలిసే వెళుతుంటారు. అలాగే ఇరు కుటుంబాలు తరచుగా కలుస్తుంటాయి కూడా. తారక్ పిల్లతో ఆడుకోవడం చాలా ఇష్టమని బోలెడు సందర్భాల్లో చరణ్ స్వయంగా చెప్పాడు. మరోవైపు రామ్ చరణ్ టాక్ షోలో పాల్గొనడం గురించి మెగాస్టార్ చిరంజీవి ఉబ్బితబ్బిబ్బయిపోయారు. రాజమౌళి ఆలోచనలో పుట్టిన ఒక అద్భుతమైన ఐడియా ఇప్పుడు విజన్ గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది అని కొడుకును ఆకాశానికి ఎత్తేసారు. ఇండియన్ సినిమా గర్వించదగిన క్షణం ఇది అంటూ ట్వీట్ చేశారు. ఇప్పడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.