మీ ముఖం మెరిసిపోవాలా.. బొగ్గు పూసుకోండి! - MicTv.in - Telugu News
mictv telugu

మీ ముఖం మెరిసిపోవాలా.. బొగ్గు పూసుకోండి!

October 28, 2019

సరదా కాదు, వెటకారమూ కాదు. పచ్చి నిజం! బొగ్గుతో మీ అందం రెట్టింపు అవుతుంది..!! షిట్… వంటపాత్రలు, దంతాలు తళతళా మెరవాలంటే బొగ్గు వాడతారుగాని, ముఖానికి ఎవరైనా పూసుకుంటారా? అని విసుక్కుంటున్నారా? అయితే పూర్తిగా చదవండి మరి. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు సౌందర్యసాధనకు, పోషణకు కూడా కాదేదీ అనర్హం. బొగ్గుతో ముఖవర్ఛస్సును పెంచుతున్నారు బ్యూటీషియన్లు. లండన్‌లోని డెబ్బీ థామస్ స్కిన్‌కేర్ సెంటర్‌లో ఈ మసిపూసుడు తతంగం నడుస్తోంది. 

Charcoal skin treatment.

బొగ్గును మెత్తగా నూరి హెన్నా టైపులో ముఖాలకు పూస్తున్నారు. తర్వాత లేజర్‌తో శుభ్రం చేస్తున్నారు. 8 సెషన్ల బొగ్గుపూతతో ముఖాలు తళతళామెరిసిపోతాయని అంటుందో అక్కడి పనిచేస్తున్న స్పెషలిస్ట్ విక్టోరియా వుడ్హాల్. నిజానికి బొగ్గును చాలా సౌందర్యాసాధనాల్లో ఎప్పటినుంచో వాడుతున్నారు. అయినే నేరుగా ముఖానికి పూయడం మాత్రం కొత్త ట్రెండ్. బొగ్గు(చార్కోల్) ప్యాకులు ఆన్ లైన్ లోనూ దొరుకుతున్నాయి. బొగ్గులోని రసాయనిక పదార్థాలు మురికిని శక్తిమంతంగా తమలోకి లాక్కుంటాయి. అందుకే టూత్ పేస్ట్ వంటి వాటిలో దాన్ని ప్రాసెస్ చేసి వాడతారు. డెబ్బీ స్కిన్‌కేర్ సెంటర్‌లో మసిపూతకు తోడు లేజర్ ట్రీట్‌మెంట్ కూడా ఉండడంతో కస్టమర్లు బాగానే వస్తున్నారట.