ప్రణయ్ హత్య కేసులో చార్జిషీట్.. ఏముందంటే - MicTv.in - Telugu News
mictv telugu

ప్రణయ్ హత్య కేసులో చార్జిషీట్.. ఏముందంటే

June 12, 2019

Chargesheet on miryalaguda amrita pranay kumar.

సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రయణ్ హత్య కేసులో తెలంగాణ పోలీసులు ఎట్టకేలకు చార్జిషీటు దాఖలు చేశారు. నల్గొండ జిల్లా కోర్టుకు బుధవారం సమర్పించిన చార్జిషీటులో అమృతవర్షిణి తండ్రి మారుతీరావు సహా 8 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 102 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1600 పేజీలతో చార్జిషీటును 63 పేజీల్లో దర్యాప్తు నివేదికను తయారు చేశారు. మారుతీరావు, అతని తమ్ముడు కిరాయిగుండాలకు డబ్బులు ఇచ్చి ప్రణయ్‌ని చంపించారని పేర్కొన్నారు. హత్య జరిగిన 9 నెలల తర్వాత వీటిని కోర్టుకు సమర్పించారు.

గతే ఏడాది సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడ ప్రణయ్‌ కుమార్ అనే యువకుణ్ని హత్య చేశారు. అతడు తన కూతురిని ప్రేమించి పెళ్లిచేసుకోవడాన్ని జీర్ణించుకోలేక మారుతీరావు రూ. కోటి రూపాయai ఇచ్చి కిరాయి హంతకులతో చంపించాడు. మారుతీరావు, అతని తమ్ముడు శ్రావణ్‌, మరో నిందితుడు కరీం ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో మొదట ఏడుగురు నిందితులని పోలీసులు చెప్పారు. చార్జిషీటులో మరొకరిని చేర్చారు. అందులోని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రయాణ్ హత్య సమయంలో గర్భంతో ఉన్న అమృత ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబుకు జన్మనిచ్చారు.