డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకు హీరోయిన్ చార్మి హైకోర్టుని ఆశ్రయించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ నెల 26 న విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసు పై ఆమె హైకోర్టు కు వెళ్లింది. విచారణకు న్యాయవాదిని కూడా అనుమతించాలని పిటిషన్ లో కోరింది.. బలవంతంగా రక్త నమూనాలు సేకరించడం చట్టవిరుద్ధమంటూ తన పిటిషన్ లో పేర్కొంది.