Charmy's sensational decision..are the boys taking a break..
mictv telugu

ఛార్మీ సంచలన నిర్ణయం..అబ్బాయిలు బ్రేక్ తీసుకుంటున్నా..

September 4, 2022

‘నీతోడు కావాలి’ అనే చిత్రంతో తెలుగు చిత్రసీమ పరిశ్రమలోకి అడుగుపెట్టి, ‘కుర్రాడొచ్చాడు’, ‘శ్రీ ఆంజనేయం’, ‘గౌరి’, ‘మాస్’, ‘జ్యోతిలక్ష్మీ’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు నటి ఛార్మీ. తాజాగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘లైగర్’ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘లైగర్’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశకు గురైయ్యారు.

 

ఈ క్రమంలో నటి, నిర్మాత ఛార్మీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం ఆమె ఓ ట్విట్ పెట్టారు. “కాస్త శాంతించండి అబ్బాయిలూ, సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. ‘పూరీ కనెక్స్ట్ ‘ సంస్థ మరింత దృఢంగా, ఉన్నతంగా సిద్ధమై త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుంది” అని పేర్కొంది.

ఇక, ‘లైగర్’ సినిమా విషయానికొస్తే.. ప్యాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. విడుదలైన తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ అందుకుంది. వారం రోజుల్లోనే థియేటర్ల నుంచి బయటికి వెళ్లే పరిస్థితికి చేరుకుంది. పూరీ, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్ దాదాపు వంద కోట్ల రూపాయాల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. కానీ, అందులో సగం కూడా రాబట్టలేకపోవడమే కాకుండా, తీవ్ర విమర్శలకు గురైయ్యింది. ఈ భారీ డిజాస్టర్ అటు హీరో విజయ్‌తోపాటు దర్శకుడు పూరీ, సహ నిర్మాత ఛార్మీ కౌర్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ క్రమంలో మరో మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఛార్మీ సోషల్ మీడియాకు తాత్కాలికంగా చెక్ పెట్టింది.