Charter plane carrying 12 passengers from India lands at Karachi airport
mictv telugu

హడావుడిగా పాకిస్థాన్‌లో ల్యాండ్ అయిన హైదరాబాద్ విమానం

August 16, 2022

హైదరాబాద్‌ నుంచి బయలు దేరిన విమానాలు పాక్‌ లో ల్యాండ్‌ అవడం పై సర్వత్రా కలకలం రేపుతోంది. ప్రయాణికులతో బయలుదేరిన పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాలు.. ఇటీవల తరచుగా అత్యవసరంగా ల్యాండ్ అవుతుండటం ప్రయాణికుల్లో అలజడి సృష్టిస్తోంది. అయితే.. అధికారులు మాత్రం వివిధ సాంకేతిక సమస్యలు కారణంగా ల్యాండ్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ ఘటనలపై జులైలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించారు కూడా. అయినా మళ్లీ సోమవారం 12 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక అద్దె విమానం పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. నిన్న మధ్యాహ్నం 12.10 గంటలకు జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగింది. కొద్దిసేపటికి మళ్లీ అది 12 మంది ప్రయాణికులతో అక్కడి నుంచి బయలుదేరింది. దీనికి కారణాలేంటన్నది స్పష్టంకాలేదని పాక్‌ వర్గాలు తెలిపాయి. గత నెలలో కూడాసాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో దిగాయి.