చాటింగ్ చేస్తే తిట్టారని, చెట్లపొదల్లో 4 రోజులుగా.. - MicTv.in - Telugu News
mictv telugu

చాటింగ్ చేస్తే తిట్టారని, చెట్లపొదల్లో 4 రోజులుగా..

October 12, 2020

Chatting missing girl come back

అర్థరాత్రి చాటింగ్ చేయవద్దని తిట్టారని హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన బబ్లీ అనే ఇంటర్మీడియట్ విద్యార్ధిని ఇంట్లోంచి అలిగి వెళ్లిపోయిన విషయం తెల్సిందే. అర్ధరాత్రి అయినా కూడా మొబైల్ ఫోన్‌తోనే గడపడంతో బబ్లీని ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆమె ఈనెల 9న ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు 7 బృందాలుగా బబ్లీ కోసం గాలించారు. 

పోలీసులు ఎంత వెతికినా కూడా ఆమె ఆచూకీ లభించలేదు. తాజాగా ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఈ నాలుగు రోజులుగా ఆమె ఇంటికి సమీపంలోని చెట్ల పొదల్లోనే గడిపింది. దీని గురించి ఆమె తల్లి అపర్ణ స్పందిస్తూ..’జంతువులు అంటే బబ్లీకి భయం లేదు. అందుకే చెట్ల పొదల్లో ధైర్యంగా గడిపింది. ఎట్టకేలకు మా బిడ్డ తిరిగి వచ్చింది.’ అని తెలిపింది. నాలుగు రోజులుగా కనీసం మంచి నీళ్ళు కూడా తీసుకోకపోవడంతో నీరసంగా అయిపోయి దగ్గరలోని గుడిసె వద్దకు వెళ్ళింది. ఆ గుడిసెలో ఉన్నవాళ్ళు ఆమెను ఇంటికి తీసుకు వచ్చారు. బబ్లీ మౌంట్ లీటర జీ స్కూల్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నది.