Chattisgad gave police jobs to transgenders
mictv telugu

మావోలపై పోరుకు ట్రాన్స్‌జెండర్లు.. బస్తర్ ఫైటర్స్‌లో చోటు

August 16, 2022

Chattisgad gave police jobs to transgenders

మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వారిపై పోరుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్తర్ ఫైటర్స్ యూనిట్లో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలిచ్చింది. వీరిని మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొహరించనున్నారు. ఈ యూనిట్ నియామకాల కోసం భర్తీలు నిర్వహించగా మొత్తం 608 మంది నియామకమయ్యారు. వారిలో తొమ్మిది మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. వీరంతా పోలీస్ కానిస్టేబుల్ హోదాలో పనిచేయనున్నారు. రాయపూర్‌లోని పోలీసు శిక్షణా కేంద్రంలో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.

గిరిజనులు ఎక్కువగా నివసించే ఆ రాష్ట్రంలో మావోలపై పోరుకు స్థానిక ప్రజల సహకారం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో ప్రజలకు, పోలీసులకు మధ్య సమన్వయకర్తలుగా బస్తర్ ఫైటర్స్ వ్యవహరిస్తుంది. దీనిని 2020లో ఏర్పాటు చేశారు. అటు సామాజిక సమస్యగా మారిన లింగ సమానత్వాన్ని కూడా దీని ద్వారా ప్రోత్సహించినట్టవుతుందని భావిస్తున్నారు. కాగా, ట్రాన్స్ జెండర్లకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రంగా తమ పేరు చరిత్రలో నిలిచిపోతుందని, వారికెంతో చేయాల్సి ఉందని అక్కడి పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.