నక్సల్స్ ప్రతీకారం.. 8 మంది పోలీసుల మృతి - MicTv.in - Telugu News
mictv telugu

నక్సల్స్ ప్రతీకారం.. 8 మంది పోలీసుల మృతి

March 13, 2018

ఛత్తీస్‌గఢ్‌లో కొన్నాళ్లుగా గట్టి ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్టులు భారీ ప్రతీకార దాడి చేశారు. సుకుమా జిల్లా కిష్టారంలో మంగళవారం సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చారు. తర్వాత కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో 8 మంది పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషయమంగా ఉంది. పలువురు పోలీసులు తప్పించుకున్నారు. వీరంతా 212వ బెటాలియన్‌కు చెందిన వారు.

 

ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో సుకుమా జిల్లా బుర్కపాల్ అడవుల్లో మావోయిస్టులు జరిపిన దాడిలో 25 మంది జవాన్లు మృతిచెందారు. ఇటీవల ఛత్తీస్, తెలంగాణ సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఏడుగురు మహిళలు సహా 10 మంది మావోయిస్లులు మృతిచెందడం తెలిసిందే.