Cheap dentistry .. in our Hyderabad ..
mictv telugu

తక్కువ ధరకే దంత వైద్యం.. మన హైదరాబాద్‌లోనే..

June 20, 2022

Cheap dentistry .. in our Hyderabad ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తక్కువ ధరకే దంత వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, ఆయన సతీమణి డాక్టర్‌ శ్రీదేవిలు తెలిపారు. దంతాలు పీకాలన్నా, ఇంప్లాంట్‌ చేయాలన్నా, దంతాలను అమర్చాలన్నా, పుచ్చిపోయిన దంతాలను తొలగించలన్నా, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను నిర్ణయించామని పేర్కొన్నారు. మరి ఇంతకి ఆసుపత్రులు నగరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? ధరలు ఏ విధంగా ఉన్నాయి? అనే విషయాలను తెలుసుకుందాం.

డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, ఆయన సతీమణి డాక్టర్‌ శ్రీదేవిలు మాట్లాడుతూ..”పేదలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, అతితక్కువ ఖర్చుతో సరసమైన ధరలకే అన్ని రకాల దంతవైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రకారమే.. హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల్లో ఏరియా డెంటల్‌ చారిటబుల్‌ హాస్పిటల్‌ బ్రాంచ్‌లను ఏర్పాటు చేశాం. రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ నుంచి మొదలుకొని నూతన దంతాలను అమర్చడం, పుచ్చిపోయిన దంతాలను తొలగించడం వంటి వైద్య సేవలను అందిస్తున్నాం. ఆహార భద్రత కార్డు ఉన్న వారికి మరింత తక్కువ ధరకే వైద్యం చేస్తున్నాం. త్వరలోనే మరిన్ని బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నాం” అని వారు అన్నారు.

మొదటగా హనుమాన్‌ టేక్డీలో 2012లో ఏరియా డెంటల్‌ చారిటబుల్‌ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశామని, ఆ తర్వాత సంతోష్‌నగర్‌, మెహిదీపట్నంలో బ్రాంచ్‌లను స్థాపించి, అత్యాధునిక యంత్రాల ద్వారా వైద్య సేవలు అందజేస్తున్నామని, హనుమాన్‌ టేక్డీలోని ఆసుపత్రిలో ప్రతి నిత్యం వంద మందికి పైగా దంత వైద్యులు పనిచేస్తున్నారని డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ తెలిపారు.

ఇక, ధరల విషయానికొస్తే.. రూట్‌ కెనాల్‌ ట్రీట్‌‌మెంట్‌కు కేవలం రూ.300లకే చేస్తున్నారు. దంతాలను అమర్చటం కోసం రూ.500లతో పూర్తి స్థాయి వైద్యం అందజేస్తున్నారు. దంతాల ఎక్స్‌రే, దంతాల సిటీ స్కాన్‌, సీబీసీటీ వంటి దంత పరీక్షలు కూడా అత్యాధునిక యంత్రాల ద్వారా అతి తక్కువ ధరకే నిర్వహిస్తున్నారు.

డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, ఆయన సతీమణి డాక్టర్‌ శ్రీదేవి ఉస్మానియా దంత వైద్య కళాశాలలో విద్యను పూర్తి చేసుకున్నారు. దంత వైద్యం విషయంలో ప్రస్తుతం ప్రైవేట్‌ దవాఖానల్లో వేలకు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దాంతో నిరుపేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, ఆయన సతీమణి డాక్టర్‌ శ్రీదేవిలు పేద ప్రజలకు చికిత్స చేసేలా, సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని అబిడ్స్ ఏరియాతోపాటు సంతోష్‌నగర్‌, మెహిదీపట్నంలో బ్రాంచ్‌లను స్థాపించి వైద్యం అందిస్తున్నారు.