బయోపిక్ తీస్తున్నామని చెప్పి.. నమ్మించి మోసం చేశారు - MicTv.in - Telugu News
mictv telugu

బయోపిక్ తీస్తున్నామని చెప్పి.. నమ్మించి మోసం చేశారు

June 6, 2022

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు చెప్పుకొని ఘరానా మోసానికి పాల్పడ్డారు కొందరు కేటుగాళ్లు. సుశాంత్ సింగ్‌పై సినిమా తీస్తామని చెప్పి ఓ హోటల్ ఓనర్‌ను రూ.8 లక్షల మేర మోసం చేశారు. దేశ రాజధాని దిల్లీ సమీపంలోని నోయిడాలో ఈ ఘటన జరిగింది, బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

నోయిడా థానా సెక్టార్-39లోని ఓ హోటల్లో విజయ్ శేఖర్, నితిన్ పంత్, సచిన్ తివారీ, వరుణ్ ఖండేల్వాల్ అనే పేర్లతో నలుగురు వ్యక్తులు 2020లో నాలుగు గదులు బుక్ చేసుకున్నారు. హోటల్ నిర్వాహకులకు… తాము సినిమా డైరెక్టర్లు అని చెప్పి, చనిపోయని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై బయోపిక్ తీస్తున్నామని నమ్మించారు. వారిలో ఒకడు సుశాంత్ పాత్రను తాను పోషించనున్నట్లు చెప్పి పెద్ద కలరింగ్ ఇచ్చాడని హోటల్ యజమాని వాపోయాడు. ఏడాది పాటు 4 గదుల అద్దె చెల్లించకుండానే రూమ్‌లను ఖాళీ చేసి వెళ్లిపోయారని ఆరోపించాడు. నిందితులు ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయ్యిందంటూ కోర్టును ఆశ్రయించాడు. రూ.8లక్షలు మోసపోయానంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు… అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.