ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు..ఐడియా కాపీ కొట్టాడని - MicTv.in - Telugu News
mictv telugu

ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు..ఐడియా కాపీ కొట్టాడని

February 27, 2020

gbcgnbhg

కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ‘బాత్‌ బిహార్‌ కీ’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఆయనపై చీటింగ్‌ కేసు నమోదైంది. తన ఐడియాను కాపీ చేసి ప్రశాంత్‌ కిషోర్‌ ‘బాత్‌ బిహార్‌ కీ’ అనే కార్యక్రమాన్ని రూపొందించారంటూ బిహార్‌ మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

‘బాత్‌ బిహార్‌ కీ’ కార్యక్రమం తన ఆలోచనల్లో రూపుదిద్దుకుందని.. కానీ, తన మాజీ సహోద్యోగి అయిన ఒసామా అనే వ్యక్తి ఆ ఆలోచనను ప్రశాంత్‌ కిషోర్‌తో పంచుకున్నాడని గౌతమ్‌ ఆరోపించాడు. తాను ‘బిహార్‌ కీ బాత్‌’ అనే కార్యక్రమాన్ని జనవరి నెలలో ప్రారంభిస్తే.. ఆయన తన కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలలో ప్రారంభించాడని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశాడు. దీంతో పోలీసులు 402, 406 సెక్షన్ల కింద ప్రశాంత్‌ కిషోర్‌, ఒసామాలపై కేసులు నమోదుచేశారు.