మైసూరు రాజు హారమంట.. 5 లక్షలకు కొని లబోదిబో..  - MicTv.in - Telugu News
mictv telugu

మైసూరు రాజు హారమంట.. 5 లక్షలకు కొని లబోదిబో.. 

September 13, 2019

Cheating In The Name of Mysore Maharaja Ornaments

మెరిసేదంతా బంగారం కాదు.. కంటికి కనపడిందల్లా నిజం కాదు ఈ సామెత అక్షరాల నిజమైంది. ప్రస్తుతం మార్కెట్లో రోల్డ్ గోల్డ్ రాజ్యమేలుతోంది. నిజమైన బంగారంలా తళతళా మెరిసిపోతూ అందరిని ఆకర్షిస్తుంటాయి. చాలా మంది బంగారం కొనలేని వారు ఫంక్షన్లకు రోల్డ్ గోల్డ్ కూడా వేసుకుంటున్నారు. ఇంత వరకు భాగానే ఉన్నా.. నిజమైన బంగారం కొందామని వెళ్లి నకిలీ బంగారం మాయలో పడిపోయి కొంత మంది నిండా మునిగిపోతున్నారు. తాజాగా ఇటువంటి ఉదంతం నెల్లూరు జిల్లాలో జరిగింది. మైసూరు మహారాజు హారం పేరుతో నమ్మబలికి పుత్తడి అంటూ ఇత్తడి హారాన్ని చేతిలో పెట్టి రూ. 5 లక్షలు దోచుకెళ్లారు కొంత మంది కేటుగాళ్లు. 

చెంజెర్ల మండలం మాముడూరుకు చెందిన గపూర్ అనే వ్యక్తి ఆగస్టు 13న బైక్‌పై వెళ్తూ కముజు పిట్టలు కొనేందుకు సంగం గ్రామ ప్రాంతంలో ఓ చోట ఆగాడు. అప్పటికే వారి వద్ద పిట్టలు అయిపోయాయని అడవికి వెళ్లి తీసుకువచ్చాక సమాచారం ఇస్తామంటూ అతని ఫోన్ నెంబర్ తీసుకున్నారు. తర్వాత 26వ తేదీన ఫోన్ చేసి తమ వద్ద మైసూరు మహారాజు బంగారు హారం ఉందని చెప్పారు. ఎవరికి అమ్మాలో తెలియక అతనికి ఫోన్ చేసినట్టు చెప్పారు. తమ స్నేహితుడు మైసూర్‌లో ప్రొక్లైన్‌తో తవ్వకాలు జరుపుతుండగా అది బయటపడిందని నమ్మబలికారు. దాన్ని పంచుకోవడంలో వివాదం రావడంతో ఎవరికైనా అమ్మి వచ్చిన డబ్బును అంతా సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. 

అయితే వారి మాటలు ముందు గపూర్ నమ్మలేదు. దొంగలించిన సొమ్మును తవ్వకాల్లో దొరికిందటూ చెబుతున్నట్టు అనుమానించాడు. తర్వాత దాని నాణ్యతపై కూడా అతనికి అనుమానం రావడంతో వారిని ప్రశ్నించారు. అలాంటిదేమి లేదని కావాలంటే పరీక్షించుకోండి అంటూ తమ గ్రామానికి తీసుకెళ్లి అక్కడ దాన్ని పరిశీలించిన తర్వాత బంగారమే అని నమ్మి డబ్బు సిద్ధం చేసుకుంటానని చెప్పాడు. తర్వాత ఆగస్టు 31న వారికి రూ. 5 లక్షలు ముట్టజెప్పి బంగారు హారాన్ని తీసుకెళ్లాడు. మళ్ల దానిపై అతనికి అనుమానం రావడంతో తనకు తెలిసిన వారి వద్ద పరీక్షించగా నకిలీ బంగారమని తేలింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రగంలోకి కేటుగాళ్ల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. తక్కువ ధరకే ఇస్తామంటూ ఎవరైనా మాయ మాటలు చెబితే వారి మాటలకు ఎవరూ మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.