పెట్రోల్‌ ధరలకు చెక్.. హోండా బైక్‌ వచ్చేస్తోంది - MicTv.in - Telugu News
mictv telugu

పెట్రోల్‌ ధరలకు చెక్.. హోండా బైక్‌ వచ్చేస్తోంది

April 21, 2022

bick

దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా పెట్రోలు ధర మండిపోతోంది. రోజు రోజుకు పెరుగుతూ వాహనదారులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. దీంతో సామాన్యుడు బండిని బయటికి తీయాలంటే భయపడుతున్నాడు. రెండేళ్లలో లీటరు పెట్రోలు ధర సూమారు రూ. 50 వరకు పెరిగింది.

ప్రజలు పెట్రోలు వాహనాలకు చెక్ పెట్టి, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వైపు అడుగులు వేస్తున్నారు. అటువంటి వారికి దేశీయ సంస్థ హోండా మోటర్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోలుతో పాటు ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్‌ ఇంజన్‌ను ఉపయోగిస్తూ, సరికొత్త ఐడియాతో బైక్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతోంది. అతి త్వరలోనే ఈ బైక్‌ను మార్కెట్‌లోకి తెచ్చే విధంగా సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే టీవీఎస్‌ సంస్థ ఫ్లెక్స్‌ ఇంజన్‌తో అపాచీ ఆర్టీఆర్‌ 200 ఎఫ్‌ఐ ఈ100 బైకును మార్కెట్‌లోకి తెచ్చింది. ఆ తర్వాత హోండా సంస్థ నుంచి మరో బైక్‌ మార్కె‍ట్‌లోకి రాబోతోంది. లీటరు పెట్రోలు ధరతో పోల్చినప్పుడు సగం ధరకే ఇథనాల్‌ లభిస్తుంది. అంతేకాక రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు ఖుషీ అవుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు చెక్ పెట్టి, ఇథనాల్‌ ఆయిల్‌తో నడిచే వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు.