యూట్యూబ్‌ యాడ్స్‌కు ఇలా చెక్ పెట్టేయండి.. - MicTv.in - Telugu News
mictv telugu

యూట్యూబ్‌ యాడ్స్‌కు ఇలా చెక్ పెట్టేయండి..

May 4, 2022

యూట్యాబ్‌లో వీడియో ప్లే అవుతున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? స్కిప్ చేయలేని అడ్వర్టైజ్మెంట్‌తో చికాకు కలుగుతోందా? ఇకనుంచి ఆ యాడ్స్ ఇబ్బందిపెట్టకుండా యూట్యాబ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

గతంలో యూట్యాబ్‌లో వీడియో ప్లే అవడానికి ముందు ఒక్క యాడ్ మాత్రమే వచ్చేది. రాను రాను ఆ యాడ్స్ సంఖ్య పెరగడంతో స్కిప్ చేసే ఆప్షన్ లేకుండా పోతుంది. ఈ ఇబ్బందిని నేటికీ ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో యూట్యాబ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇకనుంచి యూట్యూబ్‌లో ప్రకటనలు లేకుండా వీడియోను చూడాలనుకుంటే ప్రీమియం యాక్సెస్ తీసుకునేలా వెసులుబాటు కల్పించింది. యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోను చూసేలా, ఈ యాడ్స్ బ్లాకర్ ఉపయోగపడుతుంది. సెల్‌ఫోన్ లేదా పర్సనల్ కంప్యూటర్‌లో ఈజీగా యాడ్ బ్లాకర్ ఉపయోగించవచ్చని తెలిపింది.

ఇందుకోసం ఏం చేయాలి అనే వివరాలను వెల్లడించింది. ”యూడ్ బ్లాకర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యాడ్స్ లేకుండానే యూట్యూబ్ వీడియోలు చూడవచ్చు. అంతేకాకుండా థర్డ్ పార్టీ యాడ్ బ్లాకర్ యాప్లనూ ఉపయోగించవచ్చు. దీనికోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాడ్ బ్లాక్, ప్రైవేట్ బ్రౌజర్‌ని డౌన్‌లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది చాలా సాధారణమైనది. సైట్‌లో కనిపించే చాలా ప్రకటనలను బ్లాక్ చేస్తుంది”.