ఫాలో ఫాలో బేసిక్ మ్యాథ్స్..లేదంటే ట్రైన్ మిస్..!
రైల్వే ప్రయాణం చేయబోతున్నారా…టికెట్ కన్ ఫామ్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే మీకు కూడికలు, తీసివేతలు వచ్చి ఉండాలి. లేదంటే కాలిక్యూలేటరో, స్మార్ట్ ఫోనో ఉండి తీర్చాల్సిందే.. పీఎన్ ఆర్ స్టేటస్ కు ..బేసిక్ మ్యాథ్స్ కు లింకేంటి అనుకుంటున్నారా.. రైల్వే తిక్కకు లెక్కుందా..?
986+55= ఎంత…664-133= ఎంత… ఇలాంటి లెక్కల్లో మంచి పట్టు ఉండాలి. స్కూల్లో మ్యాథ్స్ చేశారో, లేదో ఇక్కడ మాత్రం మస్ట్. ఈ కూడికలు, తీసివేతల్ని మాత్రం కరెక్ట్ గా చేస్తేనే పిఎన్ ఆర్ స్టేటస్ తెలుస్తుంది. లేదంటే అంతే. ఇంతకు ముందే రైల్వే వెబ్ సైట్ లో పిఎన్ ఆర్ స్టేటస్ తెలుసుకోవాలంటే క్యాప్చ…అక్కడ చూపించిన క్యాపిటల్,స్మాల్ లెటర్స్, నెంబర్స్ ను యాజ్ టిజ్ గా టైప్ చేయాలి. వాటిని అక్కడ కనిపించిన బాక్స్ లో టైప్ చేస్తేనే ఫైనల్ గా రిజల్ట్ వచ్చేది.
రైల్వే కొత్త వెబ్ సైట్ లో ఇప్పుడు ఆ అవకాశం లేదు. బీటా వెర్షన్ లో కంపల్సరీగా బేసిక్ మ్యాథ్స్ తెలిసి ఉండాల్సిందే. ఈ సారి రైల్వే ప్రయాణం చేయబోయే ముందు కాలిక్యూలేటర్, స్మార్ట్ ఫోన్ తీసుకెళ్లడం మర్చిపోకండి..లేదంటే ఇబ్బందులు పడుతారు. సో ఫాలో ఫాలో బేసిక్ మ్యాథ్స్ అంటూ బిందాస్ గా రైలు ఎక్కేయండి. ఆల్ ది బెస్ట్.. హ్యాపీ జర్నీ…