శ్రీలంకలో చెడ్డీల నిరసన.. దేశంలో ఎమర్జెన్సీ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీలంకలో చెడ్డీల నిరసన.. దేశంలో ఎమర్జెన్సీ

May 7, 2022

శ్రీలంకలో శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి మరోసారి ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీతో పరిస్థితులు తారస్థాయికి చేరుకుంటున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు రోడ్లమీదికి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.

మరోవైపు శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన..విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్‌లను ప్రయోగించారు. దాంతో ఆగ్రహించిన విద్యార్థులు పార్లమెంటు ముందు అండర్ వేర్లతో నిరసనకు దిగారు. గోటబాయ ఇంటికి వెళ్ళాలంటూ (గో టూ హూమ్) నినాదాలతో పార్లమెంటు ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో తమ అండర్ వేర్లను చూపుతూ, విద్యార్థులు నిరసన తెలుపుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.