”భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారని నేను అనలేదు. నేను అనని మాటను అన్నట్టుగా టీవీల్లో, వెబ్‌సైట్‌ల్లో బ్రేకింగ్స్ పెట్టొదు అని మీడియాను వేడుకుంటున్నా. నిధుల విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మోదీని కలుస్తుంటారని మాత్రమే అన్నాను. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని అన్నాను. ఛీ..ఛీ..అనని మాటను అన్నట్టు రాయకండి” అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన వెంటనే..సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి బ్రదర్ వెంకట్ రెడ్డి సైతం బీజేపీతో టచ్‌లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై నేడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, క్లారిటీ ఇచ్చారు.
”ఉప ఎన్నికలు కోరుకున్నదే సీఎం కేసీఆర్. మళ్లీ వాళ్లే ఉప ఎన్నిక ఎవరు కోరుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో 6 నెలల చొప్పున కేసీఆర్ టైం పాస్ చేశారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక పేరుతో మళ్లీ 6 నెలలు టైం పాస్ చేస్తారు” అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.