రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. ఉక్రెయిన్ దేశంపై యుద్ధం ప్రకటించిన రోజు నుంచి నేటి వరకు ఎక్కడి చూసినా, ఎక్కడ విన్న పుతిన్ పేరే వినబడుతుంది. తాజాగా పుతిన్‌కు ఓ స్పెషల్ బాడీగార్డు ఉన్నాడని, అతడు చేసే పాడు పనికి సంబంధించి, ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. పుతిన్ రహస్య బాడీగార్డ్ గురించి రష్యా దేశ మీడియా సంస్థలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి.
Putin’s bodyguards have to box up his poop and send it back to Russia https://t.co/wBlGMdVBcP
— George Elis (@PeanutCaptain_) June 14, 2022
”రష్యా ప్రెసిడెండ్ పుతిన్‌కు ఓ స్పెషల్ పర్సన్ ఉన్నాడు. అతడి ఏది చేసిన భిన్నంగా ఉంటుంది. పుతిన్ కోసం ఓ ప్రత్యేకమైన బాడీగార్డ్ ఉన్నాడనే విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఆ బాడీగార్డ్ పుతిన్ ఎక్కడికి వెళ్లితే, అక్కడికి వెళతాడు. ఆ బాడీగార్డ్ చేసే పని ఏంటో తెలుసా.. పుతిన్ మలమూత్రాలను సేకరిస్తుంటాడు. పుతిన్ ఆరోగ్య రహస్యాలు తెలియకుండా ఉండేందుకు ఆ బాడీగార్డు ఇలా ఆయన మలమూత్రాలను సేకరిస్తుంటారు”.
పుతిన్ రహస్య బాడీగార్డ్ గురించి డీఐఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రెబెకా కోఫ్లర్ మాట్లాడుతూ..’పుతిన్ విదేశీ ఇంటెలిజెన్స్‌కు ఆరోగ్య రహస్యాలు బహిర్గతం కాకుండా ఇలా జాగ్రత్తలు తీసుకుంటాడు. రష్యాకు చెందిన ఫెడరల్ గార్డ్ సర్వీస్ ప్రత్యేక సూట్‌కేసును తీసుకువెళ్తుంది. ఆ సూట్‌కేస్‌లో పుతిన్ మలమూత్రాలను తిరిగి మాస్కోకు పంపిస్తుంది’ అని ఫ్రెంచ్ పత్రికలో కథనం వచ్చినట్లు రెబెకా కోఫ్లర్ తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా సైన్యాలు దాడులు ప్రారంభమైన నాటి నుంచి పుతిన్ ఆరోగ్య పరిస్థితులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే పుతిన్‌కు కళ్లకు సంబంధించిన వ్యాధి ఉందని, మరో మూడేళ్లలో కంటి చూపు మందగించే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో పుతిన్ తన ఆరోగ్య విషయాలను రహస్యంగా ఉంచేందుకు ఓ పర్సనల్ బాడీగార్డ్ చేసే పాడు పనికి సంబంధించిన వార్తలు, ఫోటోలు వెలుగులోకి రావడంతో హాట్ టాఫిక్‌గా మారింది.