దట్టమైన అడవుల్లో సంచరించే చిరుతపులి బెంజ్ కార్ల షోరూంలోకి ప్రవేశించింది. అప్రమత్తమైన షోరూం సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వడంతో పట్టుకొని బంధించి అడవిలో వదిలేశారు. పుణెలో ఈ సంఘటన జరిగింది. వివరాలు.. సోమవారం తెల్లవారు జామున పుణె జిల్లాలోని చకాన్లో ఉన్న బెంజ్ కార్ల షోరూంలో చిరుతపులి గోడదూకి ప్రవేశించింది. అక్కడి సిబ్బంది మొదట భయపడ్డా.. తేరుకొని అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. దాంతో షోరూంకి చేరుకున్న సిబ్బంది ట్రాంక్విలైజర్ డార్ట్ను ఉపయోగించి ఉదయం 11.30కు బంధించారు. అనంతరం చిరుతను అడవిలో వదిలేశారు. కాగా, ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయం కాలేదు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.