హైదరాబాద్‌లో పేలుడు..ఒకరి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో పేలుడు..ఒకరి మృతి

November 18, 2019

chemical factory in hyderabad

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కలకలం సృష్టించింది. జీవిక లైఫ్ సైన్సెస్ ప్రై.లి కంపెనీలోని కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలడంతో ఒకరు మృతించెదరు. నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

పేలుడు దాటికి ఫ్యాక్టరీలో పై కప్పుతో పాటు.. కొన్ని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. రేకులు కొన్ని మీటర్ల పైకి ఎగిరి పక్కనే ఉన్న ఇళ్లపై పడడంతో వారు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఫ్యాక్టరీ లోపల కార్మికుడు చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు అందిస్తున్నారు.