హైదరాబాద్ శివారుల్లో పేలుడు.. కెమికల్ లారీలో మంటలు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ శివారుల్లో పేలుడు.. కెమికల్ లారీలో మంటలు

June 30, 2020

ngnvgbn

హైదరాబాద్ నగర శివారుల్లో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం ఉదయం 4.30 గంటల సమయంలో ఓ లారీలో పేలుడు జరిగి భారీగా మంటలు వ్యాపించాయి. మియాపూర్ ఆల్విన్ చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే జనసంచారానికి దూరంగా ఈ ప్రమాదం జరగడంతో ఎవరికి ప్రమాదం జరగలేదు. అప్రమత్తమైన డ్రైవర్ కూడా లారీలోంచి కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. 

ఓ కెమికల్ ఫ్యాక్టరీ కోసం రసాయనాలను తరలిస్తున్న లారీ అల్వీన్ చౌరస్తాకు చేరుకోగానే మంటలు వ్యాపించాయి. దీన్ని గమనించిన డ్రైవర్ పక్కకు ఆపేసి కిందకు దూకేశాడు. ఆ వెంటనే భారీ పేలుడుతో మంటలు అంటుకున్నాయి. విషయం ఫైర్ సిబ్బందికి తెలియడంతో వారు వచ్చి మంటలు ఆర్పేశారు. మరో గంట ఆలస్యంగా ఇది జరిగి ఉంటే మాత్రం ప్రాణ నష్టం జరిగేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.