ఎవరైనా కొత్తగా మెడిసిన్ కనిపెడితే.. ముందుగా జంతువుల మీద ప్రయియోగిస్తారు. జంతువులపై విజయవంతం అయితే మనుషులపై ప్రయోగిస్తారు. మనుషులపై కూడా విజయవంతం అయితే.. ప్రభుత్వం అనుమతితో మార్కెట్ లోకి తీసుకుని వస్తారు. కానీ, చెన్నైలోని పెరుంగుడికి చెందిన శివ నేసన్ అనే ఫార్మసిస్ట్ జలుబు కోసం కొత్త మందును కనిపెట్టి తనమీదే ప్రయోగించుకున్నారు. దానిని తీసుకున్న కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గురువారం రాత్రి తైనంపేట్‌లో జరిగింది.
రాజ్‌కుమార్ అనే వైద్యుడి ఇంట్లోనే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫార్మసిస్ట్‌తో పాటు ఈ డ్రగ్ తయారీలో రాజ్ కుమార్ పాత్ర ఉందన్న కోణం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజ్‌కుమార్ ఆ మందులో కొద్ది భాగం మాత్రమే వేసుకోగా.. శివనేసన్ మరింత మింగడంతో అప్పటికప్పుడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. శివ నేసన్ చెన్నై రాకముందు ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రయివేటు బయోటెక్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాడు. తరువాత కొడంబాక్కంలోని భూపతినగర్‌లో అదే కంపెనీకి చెందిన ఓ ల్యాబ్‌లో పనిచేశాడు.