అక్షరం తేడా.. ప్రపంచ స్థాయిలో  అగ్రస్థానం మిస్.. - MicTv.in - Telugu News
mictv telugu

అక్షరం తేడా.. ప్రపంచ స్థాయిలో  అగ్రస్థానం మిస్..

April 16, 2019

ప్రపంచ స్థాయిలో గుర్తింపు అంటే  మాములు విషయం కాదు. దానికి ఎంతో సమయం, ఎన్నో ప్రయత్నాలు కావాలి. అఖరి వరకు వెళ్లి చాలా మంది విఫలమవుతుంటారు. ఇలాగే అయ్యింది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిస్థితి. ఒక్క అక్షరం తేడాతో ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇటీవల ఈ స్టేషన్‌ను.. పురచ్చితలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. గత వారమే అమలులోకి వచ్చింది.

Chennai Central loses the honour of having longest railway station name by 1 letter

ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని రైల్వే స్టేషన్ల పేర్లలో అధిక అక్షరాలతో ఉన్న జాబితాలో మొదటి స్థానాన్ని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కొద్దిలో మిస్ అయ్యింది. 58 అక్షరాలతో వేల్స్ రైల్వేస్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. దాని పూర్తిపేరు.. Llanfairpwllgwyngyllgogerychwyrndrobwllllantysiliogogogoch. ఇక  57 అక్షరాలతో చెన్నై సెంట్రల్ స్టేషన్ రెండో స్థానంలో నిలిచింది. దీని పూర్తి పేరు Puratchi Thalaivar Dr. M.G. Ramachandran Central Railway Station ఆ తర్వాత కర్ణాటకలోని క్రాంతివీర సాంగొలి రాయన్న బెంగుళూరు సిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెంకటనరసింహ రాజువాణి పేట, మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ ఇలా దేశంలో అధిక అక్షరాలు కలిగిన రైల్వేస్టేషన్లుగా ఉన్నాయి.