కరోనా పేషంట్ల అంత్యక్రియలకు ఇక మనుషుల అక్కర్లేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పేషంట్ల అంత్యక్రియలకు ఇక మనుషుల అక్కర్లేదు..

July 1, 2020

కరోనా వైరస్ పేషంట్లను చూస్తేనే జనం ఆమడ దూరం పారిపోతున్నారు. ఇక మృతదేహాలకు అంత్యక్రియలపై సాగుతున్న వివాదాలకు అంతే ఉండడం లేదు. చివరకు వైద్యసిబ్బంది కూడా వాటిని ముట్టుకోకుండా చెత్తబండ్లలో తరలిస్తున్నారు. స్ట్రెచర్లల్లోంచే శవాలను గుంతలో విసిరేస్తున్నాయి. అమానవీయం అన్నా, మరేమన్నా పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి సర్దుకుపోవాల్సి పరిస్థితి. 

కానీ కరోనా పేషంట్లు కూడా మనుషులే కదా. చనిపోయాక వారిని సగౌరవంగా పంపాల్సిన బాధ్యత జీవించి ఉన్నవాళ్లపైన ఉంది. కరోనా మృతదేహాలకు అంత్యక్రియల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం చెన్నైకి చెందిన రెండు కంపెనీలు సరికొత్త అంబులెన్స్ తయారు చేశాయి.  దీని సాయంలో అసలు మనుషుల అవసరమే లేకుండా పని పూర్తి చేయొచ్చని చెబుతున్నారు. మాటో ఎలక్ట్రిక్ మొబిలిటీ, జాఫీ రోబోస్ కంపెనీలు దీని నమూనాను తయారు చేశారు. దీనికి రెస్క్యూయర్ అంబులెన్స్ అని పేరు పెట్టారు. మృతదేహాన్ని ఇందులో పెడితే అది గుంత వద్దకు వెళ్లి కింది భాగాన్ని తెరిచి జారవిడుస్తుంది. దీంతో వైద్యసిబ్బంది, కుటుంసభ్యులకు కరోనా సోకే ప్రమాదాన్ని నివారించడమే కాకుండా గౌరవంగా అంత్యక్రియలు కూడా పూర్తిచేసినట్లు అవుతుంది.