పోలీసమ్మ కక్కుర్తి.. చోరీ చేసి ఏడుపు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసమ్మ కక్కుర్తి.. చోరీ చేసి ఏడుపు

August 10, 2020

Chennai Constable Theft Chocolates.

దొంగలను పట్టుకోవాల్సిన ఓ కానిస్టేబుల్ చోర కళను ప్రదర్శించి చిక్కుల్లో పడింది.  రూ. 115 విలువ చేసే చాక్లెట్లు తీసుకుంటూ సూపర్ మార్కెట్ సిబ్బంది కంటపడింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆమె తన ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. చెన్నైలోని కిల్పాక్కంలో ఇది జరిగింది. 

హెడ్ కానిస్టేబల్ నందిని ఇటీవల చేట్‌పెట్‌లోని నీలగిరి సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ ఓ ర్యాక్‌లో ఉన్న చాక్లెట్లను ఎవరూ గమనించక ముందు తీసుకోవాలని అనుకుంది. కానీ సీసీ కెమెరాలో ఇది చూసి ఆమెను నిలువరించారు. వెంటనే ఆమెతో క్షమాపణ లేఖ రాయించుకొని వదలిపెట్టాడు. అయితే అక్కడ జరిగిన అవమానం తట్టుకోలేక ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకుంది. దీనిపై ఆమె భర్త ఆరా తీయగా విషయం చెప్పింది. కోపంతో నందిని భర్త స్నేహితులతో కలిసి సూపర్ మార్కెట్‌కు వచ్చి సిబ్బందిపై దాడి చేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వ్యవహారంపై సూపర్ మార్కెట్ యజమాని పోలీసు కేసు పెట్టడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విచారణ పూర్తి అయ్యే వరకు ఆమెను విధుల నుంచి తప్పించారు.