కరోనా దోపిడీ రూ. 400 మందులకు రూ. 3.5 లక్షల బిల్లు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా దోపిడీ రూ. 400 మందులకు రూ. 3.5 లక్షల బిల్లు

June 30, 2020

Tik tok mobile application clos

కరోనా విపత్కర సమయాల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని ఆపడలేదు. బిల్లుతో కరోనా బాధితులను భయపెడుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు వసూలు చేయకుండా..ఏవేవో పేర్లు చెప్పి వేలకు వేలు అదనంగా వసూల్ చేస్తున్నాయి. ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శం. కరోనా లక్షణాలతో హాస్పిటల్ లో చేరిన బాధితుడికి ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఏకంగా మూడున్నర లక్షల బిల్లు వేసింది. 16 రోజులు ఆస్పత్రిలో ఉంచుకొని కేవలం రూ.400 మందులు మాత్రమే ఇచ్చింది. కానీ, డిశ్చార్జ్ సమయంలో మాత్రం మూడున్నర లక్షల రూపాయల బిల్ వేసింది. 

కరోనా బాధపడుతోన్న ఓ వ్యక్తి(38) మే 28న కట్టనంకులాతుర్‌లోని ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేరి 16 రోజులు చికిత్స పొందాడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత జూన్ 13న డిశ్చార్జి చేశారు. డిశ్చార్జి సమయంలో ఏకంగా రూ.3,55,595 బిల్లు వేశారు. దీంతో ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చినంత పనైంది. అంత కాలేదని ఆ వ్యక్తి వాదించాడు. అయినా కూడా ఏవేవో చార్జీలు చెప్పి మొత్తం బిల్లు వసూలు చేశారు. ఈ బిల్లుకి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.