నటి, ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణిపై నమోదైన కేసులో తమిళనాడు కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆయనను అరెస్ట్ చేయాలని నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 2016లోనా ఓ వివాదం కేసులో కేసు విచారణ జరుపుతోంది. ఆ ఏడాది సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుల్ అన్బరసులు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోంద్రాపై ఆరోపణలు చేశారు. వారిపై జార్జిటౌన్ కోర్టులో ముకుంద్ పురువునష్టం దావా వేశారు. ముకుంద్ చనిపోవడంతో ఆయన కొడుకు గగన్ కేసు సాగిస్తున్నారు. మంగళవారం ఈ కేసును కోర్టు విచారించింది. అయితే సెల్వమణి, అరుల్ విచారణకు గైర్హజరయ్యారు. అంతేకాకుండా వారి న్యాయవాదులు కూడా డుమ్మా కొట్టారు. దీతో కోర్టు ఆగ్రహించింది. నిందితులపై నాన్ బెయిలెబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కేసును ఈ నెల 23కు విచారణను వాయిదా వేసింది.