అదృష్టమంటే ఇదే.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు.. కానీ అంతలోనే - MicTv.in - Telugu News
mictv telugu

అదృష్టమంటే ఇదే.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు.. కానీ అంతలోనే

May 30, 2022

చెన్నైలోని టి.నగర్ ప్రాంతానికి చెందిన కొందరు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. వారి బ్యాంక్ ఖాతాలలో రూ.13 కోట్లు జమ అవ్వడంతో షాక్‌కు గురయ్యారు. అకౌంట్‌లలో నగదు జమ అయినట్లు ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూసి సంబరపడ్డారు. ఈ లోపే అనుకోని ట్విస్ట్‌కు మళ్లీ షాకయ్యారు. టి.నగర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారులకు పొరపాటున నగదు బదిలీ జరిగినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు.. ఆ 100 అకౌంట్‌లను వెంటనే బ్లాక్ చేశారు. అయితే ఇదంతా సాంకేతిక లోపం వల్ల బదిలీ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై బ్యాంకు కస్టమర్లు ఫెడరల్ క్రైమ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్ విభాగానికి ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఇంటర్నెట్ సర్వీస్‌ను హ్యాక్ చేసి ఎవరైనా నగదు బదిలీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ తరపున ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సెంట్రల్ క్రిమినల్ విభాగానికి కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.