ఆగస్టు 15 1947 భారత స్వాతంత్ర్య దినోత్సం . ఆ రోజు మన దేశ జాతీయ జెండా రెపరెపాలడిన రోజు. 70 సంవత్సాల స్వాతంత్య్రాన్ని తలుచుకుంటేనే మనస్సు ఉప్పొంగిపోతుంది. ఆ గుర్తులు కళ్ల ముందు కనబడితే దేశ భక్తి నరనరాన నిండిపొతుంది. ఆ రోజు ఎన్నో త్రివర్ణ పతాకాలు డిల్లీ నుంచి గల్లీ దాకా ఎగిరాయి. ఆనాటి పతకాల్లో ఒకటి ఇప్పటికి భద్రంగా దాచి పెట్టారు. అలానాటి జాతీయ జెండా చెక్కుచెదరకుండా ఉంది.
చెన్నై లోని సెయింట్ జార్జ్ కోట పై 1945 ఆగస్టు 15 ఎగరేశారు. 12.8 అడుగులన్న జెండాను ఉదయం 5గంటల 5 నిమిషాలకు ఎగురవేశారు. దీనిని జనవరి 26, 2013 న కోటలోని మ్యూజియం లో సందర్శకుల సందర్శనార్థం పెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎగిరవేసిన జాతీయ జెండాలో కేవలం ఇది ఒకటి మాత్రమే మంచిగా ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ పతాకం అంచులు కొద్దిగా రంగులు మారాయి . కాలానుగుణంగా మారాయి అంటున్నారు. ఈ పతాకం కోసం ప్రత్యేకంగా బాక్సు రూపొందించి దానికి అద్దాలు అమర్చి అందులో ఈ పతాకాన్ని ఉంచారు. దీనికి సిలికా జెల్ బాక్స్ లు నలువైపులా ఉంచారు. దీని వలన బాక్సు లోని ఉష్ణోగ్రత అదుపులో ఉంచి. జెండాను కాపాడుతుందట. ఈ జాతీయ జెండాను పురాతత్వశాఖ సంరక్షిస్తోంది.