గత ఐపీఎల్ సీజన్లలో ప్రత్యర్థి జట్టుపై విరుచుకు పడిన ధోనీ సేన ఈసారి మాత్రం తడబడుతోంది. ఆరంభం నుంచే కరోనా,ఆటగాళ్లు దూరం కావడంతో మొదలైన పరిణామాలు ఓటమి రూపంలోనూ వెంటాడు తిన్నాయి. వరుసగా రెండు మ్యాచ్ ల్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం చెందింది. శుక్రవారం రాత్రి ఢిల్లీతో తలపడిన తన మూడో టీ20లో 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మరోసారి ఛేజింగ్ లో వెనకబడిపోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా 43 పరుగులు, శిఖర్ ధావన్ 35 రన్స్ శుభారంభం ఇచ్చారు. దీంతో స్కోరు 3 వికెట్ల నష్టానికి 175 పరుగులకు చేరింది. ఆతర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై మొదటి నుంచి తడబడింది.
ఓపెనర్లు మురళీ విజయ్(10), షేన్‌వాట్సన్(14) పరుగులకే ఔట్ అయ్యారు. తర్వాత డుప్లెసిస్, కేదార్ జాధవ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చివర్లో ధోనీ ఉన్నాకుడా ఓవర్లు అయిపోయాయి. తీరా 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది.