ఘనుడు : పండుగ దావత్‌కు పిలిస్తే.. బిర్యానితో పాటు ఆభరణాలు కూడా మింగేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఘనుడు : పండుగ దావత్‌కు పిలిస్తే.. బిర్యానితో పాటు ఆభరణాలు కూడా మింగేశాడు

May 6, 2022

రంజాన్ పండుగ సందర్భంగా పిలిచి ఆతిథ్యమిస్తే దొంగ బుద్ధితో కనిపించిన ఆభరణాలను కూడా బిర్యానీతో పాటు తినేశాడు ఓ వ్యక్తి. చెన్నైలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రంజాన్ సందర్బంగా ఓ కుటుంబం అతిథులను పిలిచి దావత్ ఇచ్చింది. దీనికి పార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తి స్నేహితురాలితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఈ క్రమంలో అందరూ హ్యాపీగా పార్టీ చేసుకున్నారు. పార్టీ అయిపోయి అందరూ వెళ్లిపోయిన తర్వాత పార్టీ ఇచ్చిన వ్యక్తి కబోర్డ్‌లో చూస్తే అందులో ఉండాల్సిన ఆభరణాలు కనిపించలేదు. వజ్రాల నెక్లెస్, బంగారపు గొలుసు, డైమండ్ పెండెంట్‌లు చోరీకి గురయ్యాయని గ్రహించాడు. దీనికి తన స్నేహితురాలి బాయ్ ఫ్రెండే కారణమనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాయ్ ఫ్రెండుని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నాడు. మద్యం మత్తులో బిర్యానీతో పాటు ఆభరణాలను కూడా మింగేశానని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తిని వైద్యుల వద్దకు తీసుకెళ్లి స్కానింగ్ చేయించగా, ఆభరణాలు కడుపులోనే ఉన్నాయని తేలింది. అనంతరం పోలీసుల సూచన మేరకు ఆ వ్యక్తికి ఎనెమా ఇచ్చి రూ. 1.50 విలువైన ఆభరణాలను వైద్యులు బయటకు తీశారు.